రైటర్ పద్మభూషణ్ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి చేసిన మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘మేమ్ ఫేమస్’. సుమంత్ ప్రభాస్ దీనికి దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్ర పోషించారు. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి ఇతర ప్రముఖ తారాగణం. అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ప్రామిసింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో హై బజ్ ని క్రియేట్ చేసింది మేమ్ ఫేమస్. ఈ చిత్రం ఈనెల 26 న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో సుమంత్ ప్రభాస్ చిత్ర విశేషాలని పంచుకున్నారు. వెల్ కమ్ టు బిగ్ స్క్రీన్ ? థాంక్స్ అండీ మేమ్ ఫేమస్ కాన్సెప్ట్, స్ఫూర్తి గురించి చెప్పండి ? సినిమాల్లోకి రావాలనే ఉద్దేశం…