దిల్‌రాజు ప్రొడక్షన్స్ శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మిస్తోన్న సినిమా ‘బలగం’. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. వేణు ఎల్దండి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్ జోరుగా ఉన్నాయి. త్వరలోనే ‘బలగం’ సినిమాను రిలీజ్ చేయటానికి నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో సినిమాలోని పాత్రలను పరిచయం చేశారు. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ .. ‘బలగం’ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం. ఇప్పటికే విడుదలైన ఊరు పల్లెటూరు సాంగ్ పొట్టి పిల్ల సాంగ్‌లకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తున్నాయి. సినిమా ఆర్గానిక్‌గా ఆడియెన్స్‌లోకి వెళ్లిపోయింది. వేణు తన ఐడియాను ప్రాపర్‌గా…