ప్రేక్షకులిచ్చిన దైర్యంతో ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ సీక్వెల్ కు వెళ్తున్నాం : చిత్ర హీరో ర‌మ‌ణ్

Reddygaarintlo-rowdyijam

సిరి మూవీస్ బ్యాన‌ర్‌పై సీనియ‌ర్ న‌టుడు వినోద్ కుమార్,ర‌మ‌ణ్, వర్ష విశ్వనాధ్, ప్రియాంక రౌరీ, పావ‌ని, అంకిత‌, నటీనటులుగా ఎం.ర‌మేష్‌, గోపి ద‌ర్శ‌క‌త్వంలో  కె.శిరీషా ర‌మ‌ణా రెడ్డి నిర్మించిన చిత్రం ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ .  ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 8న ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ సినిమా విడుదలైన ప్రతి చోటా విజయవంతంగా ప్రదర్శింప బడుతూ ప్రేక్షకాదరణ పొందుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.ఈ సందర్భంగా.. హీరో ర‌మ‌ణ్  మాట్లాడుతూ..నాకు యాక్టింగ్ అనేది  చిన్నప్పటి కల. 15 సంవత్సరాల నుంచి కష్టపడిన నాకు సిరి మూవీస్ లో చేసిన  “రెడ్డిగారింట్లో రౌడీయిజం” ఇంత సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది.ఇన్ని పెద్ద  సినిమాల మధ్య వచ్చిన మా సినిమాను ఆదరించి సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మేము రిలీజ్ చేసిన ప్రతి చోటా విజయవంతంగా…