ప్రచారం ‘పల్స్’ పట్టేస్తున్న తెలుగు సినిమా!

ప్రచారం ‘పల్స్’ పట్టేస్తున్న తెలుగు సినిమా!

తెలుగు సినిమా ప్రచారం గురించి కొంత మాట్లాడుకోవాలి. 80 దశాబ్దాలు దాటిన తెలుగు సినిమా ప్రచారం -కొత్త వేళ్లూనుతోంది. సరికొత్త కోణాలు వెతుకుతోంది. లుక్కులు, చాప్టర్లు, ఫెస్ట్‌లు, ఫీస్ట్‌లతో కొంగొత్త వెలుగులూ విరజిమ్ముతోంది. ప్రచారం ‘పల్స్’ పట్టేందుకు ఇంకేవేవో చేస్తోంది కూడా. మొత్తంగా ప్రచారం మాత్రం సినిమాను మించిపోతోంది. ప్రమోషన్‌తో -సినిమా హిట్టు ఫట్టుకు సంబంధం లేదు. కానీ, ఆ సినిమావైపు దృష్టిని మరల్చాలంటే బలమైన ప్రచారం ఒక్కటే మార్గం. తప్పదు. ప్రచార పరిణామక్రమాన్ని ఒక్కసారి పరిశీలిస్తే-అరవయ్యో దశకం సినిమా ప్రచారం ఇప్పటి జనరేషన్‌కు అర్థమయ్యేలా చెప్పాలంటే ‘పక్కా నాటు’ అంటే సరిపోతుందేమో. జట్కా బండికో, జోడెద్దుల గూడుబండికో పోస్టర్లు అంటించి, కరపత్రాలు పంచుతూ సినిమా ప్రమోషన్ సాగేది. పల్లెల్లో జరిపే ప్రచారంతో పాటు తెరలపై సినిమాలూ ప్రదర్శించేవారు. 70వ దశకం వచ్చేసరికి ప్రమోషన్ కాస్త మారింది.…