సిరి మూవీస్ బ్యానర్‌పై రమణ్ కథానాయకుడిగా కె.శిరీషా రమణా రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ . ఈ సినిమాను ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఎం.రమేష్, గోపి దర్శకత్వం వహించారు. ప్రియాంక రౌరీ, పావని, అంకిత, వర్ష హీరోయిన్స్. సీనియర్ నటుడు వినోద్ కుమార్ విలన్‌గా నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్,సాంగ్స్‌కు మంచి ఆదరణ లభించాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 8 న విడుదలవుతున్న సందర్భంగా చిత్ర హీరో రమణ్ పాత్రికేయులతో మాట్లాడుతూ.. మాది రాయలసీమ కడప జిల్లా వీరబ్రహ్మేంద్ర మఠం దగ్గర ఎద్దులాయ పల్లె అనే మారుమూల గ్రామం.మాది వ్యవసాయ కుటుంబం. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చూసి పెరిగాను. ఆయన సినిమాలకు ఇంప్రెస్ అయి నేనుకూడా…
