రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ప్రాజెక్ట్ కె, క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీగా రూపుదిద్దుకుంటుంది. దీపికా పదుకొణె కథానాయిగా నటిస్తున్న ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్ పుట్టినరోజుల సందర్భంగా ప్రీ-లుక్ పోస్టర్ లను ఇదివరకే విడుదల చేశారు మేకర్స్. తాజాగా దీపికా పదుకొణె పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన టీమ్ చిత్రంలోని ఆమె ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేసింది. సిల్హౌట్ ఇమేజ్ దీపిక ఒక కొండపై నిలబడి వున్నట్లుగా చూడవచ్చు. సూర్యకిరణాలు ఆమె శరీరంపై పడటం గమనించవచ్చు. పోస్టర్‌పై “ఎ హోప్ ఇన్ ది డార్క్” అనే ట్యాగ్‌లైన్ పాత్ర యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ప్రాజెక్ట్ – కె భారతీయ సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న…
