తెలంగాణ తొలి మహిళా సీఎస్‍ శాంతికుమారికి ‘దీనశరణ్య’ శుభాకాంక్షలు

తెలంగాణ తొలి మహిళా సీఎస్‍గా నియామకమైన శాంతికుమారికి శుభాకాంక్షలు అందజేస్తున్న 'దీనశరణ్య' స్వచ్చంద సేవాసంస్థ చైర్మన్ చింతల సాయిబాబా, రాజేంద్రప్రసాద్, సీనియర్ జర్నలిస్ట్, నంది అవార్డు గ్రహీత ఎం.డి అబ్దుల్

తెలంగాణ తొలి మహిళా సీఎస్‍గా నియామకమైన శాంతికుమారిని కలిసి ‘దీనశరణ్య’ స్వచ్చంద సేవాసంస్థ శుభాకాంక్షలు అందజేసింది. గురువారం బీఆర్కే భవన్ లోని రాష్ట్ర సచివాలయంలో సీఎస్‍ ను కలిసిన వారిలో ఆ సంస్థ చైర్మన్ చింతల సాయిబాబా, సీనియర్ జర్నలిస్ట్, నంది అవార్డు గ్రహీత, ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎం.డి అబ్దుల్, రాజేంద్రప్రసాద్ ఉన్నారు. ప్రస్తుతం సీఎస్ సోమేశ్ కుమార్ రిలీవ్ కావడంతో శాంతికుమారిని తదుపరి సీఎస్ గా నియమించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు ఆమెను సీఎస్ గా నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి వి. శేషాద్రి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆమె తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా సీఎస్ గా చరిత్రకెక్కారు. తెలంగాణ వచ్చిన తర్వాత తొలి మహిళా సీఎస్ గా ఈ మేరకు…