జూన్ 10న ‘రెచ్చిపోదాం బ్రదర్’ విడుదల

జూన్ 10న ‘రెచ్చిపోదాం బ్రదర్’విడుదల

ప్రచోదయ ఫిలిమ్స్ పతాకంపై రవికిరణ్. వి, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రలలో ఏ.కె. జంపన్న దర్శకత్వంలో వి.వి లక్ష్మీ, హనీష్ బాబు ఉయ్యూరులు సంయుక్తంగా నిర్మించిన యాక్షన్ ఎంటర్ టైనర్ ‘రెచ్చిపోదాం బ్రదర్’. ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. జూన్ 10న ఈ సినిమా విడుద‌ల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జంపన్న మాట్లాడుతూ.. ‘‘మంచి ఎమోషన్స్‌తో కూడుకున్న వైవిధ్యభరితమైన కథ ఇది. మా కథకు తగ్గ ఆర్టిస్టులు కుదిరారు. సంగీతానికి మంచి స్కోప్ ఉన్న చిత్రమిది. సాయి కార్తీక్ సంగీతం, శ్యాం.కె. నాయుడు కెమెరా అందాలు మా చిత్రానికి ప్రధాన ఆకర్షణ, ఈ చిత్రం అన్ని త‌ర‌హా ప్రేక్ష‌కుల‌కు బాగా న‌చ్చుతుంది’’ అని అన్నారు. చిత్ర హీరో రవికిరణ్ మాట్లాడుతూ.. ‘‘నేటి వాస్తవిక పరిస్థితులకు అద్దం పట్టే చిత్రమిది. నాతో పాటు అతుల్ కులకర్ణి,…