‘చోరుడు’ ఫస్ట్ లుక్ విడుదల చేసిన సూపర్ స్టార్ ధనుష్

Dhanush Released First Look Of GV Prakash Kumar, PV Shankar, G. Dilli Babu, Axess Film Factory’s CHORUDU

విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా విజయవంతమైన చిత్రాలను అందించిన నిర్మాత జి. డిల్లీబాబు యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పై ‘చోరుడు’ అనే కొత్త చిత్రాన్ని సమర్పిస్తున్నారు. జివి ప్రకాష్, ప్రముఖ దర్శకుడు భారతీరాజా, ఇవానా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇదివరకే దర్శకుడు బాలా ‘ఝాన్సీ’లో జివి ప్రకాష్, ఇవానా ఇద్దరూ స్క్రీన్‌ను పంచుకోవడం విశేషం. ‘చోరుడు’ అడ్వెంచర్, థ్రిల్లర్ మూమెంట్స్‌తో కూడిన కామెడీ డ్రామా. పివి శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు సినిమాటోగ్రఫీని కూడా అందిస్తున్నారు. పివి శంకర్, రమేష్ అయ్యప్పన్‌ కలసి కథ & స్క్రీన్‌ప్లే అందించారు. అలాగే రాజేష్ కన్నాతో కలిసి ఇద్దరూ డైలాగ్స్ రాశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను స్టార్ హీరో ధనుష్ ఈ రోజు విడుదల చేశారు. పోస్టర్‌లో ప్రధాన తారాగణం రస్టిక్ గెటప్‌లో కనిపిస్తుంది.…