‘చెడ్డి గ్యాంగ్ తమాషా’ ట్రైలర్ విడుదల చేసిన బ్రహ్మానందం

'చెడ్డి గ్యాంగ్ తమాషా' ట్రైలర్ విడుదల చేసిన బ్రహ్మానందం

అబుజా ఎంటర్టైన్మెంట్స్ మరియు శ్రీ లీల ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సి హెచ్ క్రాంతి కిరణ్ నిర్మాణ సారధ్యం లో, వెంకట్ కళ్యాణ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం చెడ్డీ గ్యాంగ్ తమాషా. గాయత్రి పటేల్ హీరోయిన్. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన హాస్యబ్రహ్మ పద్మశ్రీ బ్రహ్మానందం ట్రైలర్ ను విడుదల చేశారు. నిర్మాత క్రాంతి కిరణ్ మాట్లాడుతూ: సినీ నిర్మాత అనేవాడు రైతు లాంటి వాడు. మా డబ్బులతో మీకు వినోదాన్ని ఇచ్చే టందుకు కృషి చేస్తాము. మేము చేస్తున్న ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. సినిమా మిమ్మల్ని అలరిస్తుంది. అందరికి నచ్చే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి చెడ్డి గ్యాంగ్ తమాషా పార్ట్2 కూడా ఉంటుంది.ఆన్నీ కుదిరితే పార్టీ…