చిన్నప్పుడే అమ్మను కోల్పోయిన వ్యక్తి దర్శకుడైతే తను కోల్పోయింది అమ్మనే కాదు జీవితంలో వెలకట్టలేని అమ్మ ప్రేమను అని తెలుసుకొని అమ్మ ప్రేమను,అమ్మాయి ప్రేమకు ముడిపెడుతూ ఒక మతాంతర ప్రేమకథ ఇతివృత్తంగా తెరకెక్కించిన చిత్రమే “రాజ్ కహానీ”. భార్గవి క్రియేషన్స్ పతాకంపై రాజ్ కార్తికేన్,చంద్రికా అవస్తి, సోనియా సాహా, ప్రియా పాల్, సాయి, జబర్దస్త్ ఫణి, నటీనటులు గా రాజ్ కార్తికేన్ టైటిల్ రోల్ లో నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భాస్కర రాజు, ధార్మికన్ రాజు లు సంయుక్తంగా నిర్మించారు. ప్రముఖ సంగీత దర్శకుడు స్వర్గీయ చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ సంగీతం సమకూర్చగా యస్.యస్.వి. ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు. మార్చి 24 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం విడుదలైన అన్ని థియేటర్స్ లలో విజయవంతంగా ప్రదర్శింప బడుతున్న సంధర్భంగా…
