‘గేమ్ ఆన్‌’ నుండి సెకండ్ లిరికల్ ‘పడిపోతున్న నిన్ను చూస్తూ… ‘ పాట విడుదల

'గేమ్ ఆన్‌' నుండి సెకండ్ లిరికల్ 'పడిపోతున్న నిన్ను చూస్తూ... ' పాట విడుదల

– మధుబాల, ఆదిత్య మీనన్ కీలక పాత్రధారులు.. – తమ్ముడు దర్శకుడు.. అన్న హీరోగా… ‘గేమ్ ఆన్ ‘ గీతానంద్, నేహా సోలంకి (90 ఎంఎల్ ఫేమ్ )హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘గేమ్ ఆన్‌’. క‌స్తూరి క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్, గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై ద‌యానంద్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వి క‌స్తూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు . తమ్ముడి దర్శకత్వంలో అన్న హీరోగా నటించడం విశేషం. మధుబాల, ఆదిత్య మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి ‘పడిపోతున్న’ అనే సెకండ్ లిరికల్ సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేసింది. కిట్టు విస్సా ప్రగడ సాహిత్యం అందించారు. అశ్విన్- అరుణ్ సంగీతం అందించారు. అనురాగ్ కులకర్ణి – హారిక నారాయణ్ ఆలపించారు. ప్రస్తుతం ఈ పాత సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తోంది. తొలిసారి…