క్రైమ్ థ్రిల్లర్ ‘జాన్ సే…’ నుండి ప్రణయ్ గా అంకిత్ ఫస్ట్ లుక్ విడుదల

క్రైమ్ థ్రిల్లర్ 'జాన్ సే...' నుండి ప్రణయ్ గా అంకిత్ ఫస్ట్ లుక్ విడుదల

క్రితి ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ No 1 గా ఎస్. కిరణ్ కుమార్ స్వీయ దర్శకత్వంలో ‘జాన్ సే’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కథ, స్క్రీన్ ప్లే కూడా కిరణ్ కుమార్ అందిస్తున్న ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. YAS వైష్ణవి సమర్పిస్తున్న ఈ చిత్రం లో థ్రిల్లింగ్ అంశాలతో పాటు లవ్ స్టొరీ కూడా కీ రోల్ ప్లే చేస్తోంది. యువ జంట అంకిత్, తన్వి హీరో హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఇందులో హీరోగా నటిస్తున్న అంకిత్ ఇంతకముందు జోహార్, తిమ్మరుసు వంటి చిత్రాల్లో నటించగా, హీరోయిన్ తన్వి ఐరావతం సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ‘జాన్ సే…’ టైటిల్ లో ఉన్న మూడు డాట్స్ సినిమాలో కీలకమైన ముగ్గురి పాత్రలను ప్రతిబింబిస్తున్నాయి. అందులో మొదటి డాట్, పాత్రను క్రిస్మస్ పర్వదినాన…