కళ్యాణం..కమనీయం సబిత-సాయికుమార్ ల వివాహమహోత్సవం!!

కళ్యాణం..కమనీయం సబిత-సాయికుమార్ ల వివాహమహోత్సవం!!

మాలమహానాడు తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ బిట్ల వెంకటేశ్వర్లు – బిట్ల పద్మ గార్ల ప్రథమ పుత్రిక చి.ల.సౌ. సబిత (ఎం.ఎస్) వివాహం శ్రీమతి అండ్ శ్రీ మంచాల రాజయ్య – లక్ష్మి గార్ల కనిష్ఠ పుత్రుడు చి. సాయికుమార్ (ఎం.టెక్)తో అత్యంత వైభవంగా కన్నుల పండువగా జరిగింది. దైవజ్ఞులగు బ్రాహ్మణోత్తములచే 27 జనవరి 2023 శుక్రవారం ఉదయం 10.15 నిమిషములకు నిర్ణహించబడిన రేవతీ నక్షత్రయుక్త మీన లగ్న పుష్కరాంశ సుముహూర్తమున సికింద్రాబాద్ బోయిన్ పల్లిలోని సి. మల్లారెడ్డి గార్డెన్ ఫంక్షన్ హాల్ లో జరిగిన ఈ కళ్యాణోత్సవానికి అతిరథమహారధులు హాజరై నూతన వధూవరులను అక్షింతలతో నిండుమనస్సుతో కలకాలం ఈ జంట కన్నులపంటగా ఉండాలని ఆశీర్వదించారు. సూర్యచంద్రుల సాక్షిగా ముత్యాల పందిరిలో వేదమూర్తులైన బ్రాహ్మణోత్తములచే పెద్దల సమక్షమున మూడుముళ్ల బంధంతో వేయి జన్మల బంధంగా నూతన వధూవరులైన సబిత…