శ్రీసింహా కోడూరి, కావ్యా కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా వారాహి చలనచిత్రం, క్రిషి ఎంటర్టైన్మెంట్స్ బ్యార్స్‌పై ఫణిదీప్ దర్శకత్వంలో రజినీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మిస్తోన్న చిత్రం ‘ఉస్తాద్’. ఈ సినిమా టీజర్‌ను రానా దగ్గుబాటి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో.. రానా దగ్గుబాటి మాట్లాడుతూ ‘‘శ్రీసింహ సహా ఈ టీమ్‌లో దాదాపు అందరితో నాకు అనుబంధం ఉంది. రాకేష్ నాతో నెంబర్ వన్ యారి చేశాడు. హిమాంక్ నా టాలెంట్ ఏజెన్సీ నడిపాడు. ఇక సింహ అయితే బాహుబలి సమయంలో ఐదేళ్ల పాటు నాతో ట్రావెల్ చేశాడు. టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది.అందరూ మంచి సినిమా చేసుంటారని అనుకుంటున్నాను. నాకు బైక్ నడపటం రాదు. అయితే ఎవరైతే బాగా వెహికల్ నడుపుతుంటారో వారిని బాగా…