సినిమా చాలా బాగా వచ్చింది.. మే 5న వస్తున్నాం : నిర్మాత మహేశ్వరి.కె రోషన్. ముస్తఫా అస్కరి, శ్రీనివాస్ ప్రభన్, అనిరుద్. పూజ, లయ, ఇందు, సాయి శ్రీ, శ్రీవల్లి, కీర్తన, సత్తిపండు, కోటేష్ మానవ. తదితరులు నటీనటులుగా రూపొందుతోన్న చిత్రం ‘అరంగేట్రం’. మహి మీడియా వర్క్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ ప్రభన్ దర్శకత్వంలో మహేశ్వరి కె. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 5న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. ఈ సందర్భంగా… దర్శకుడు శ్రీనివాస్ ప్రభన్ మాట్లాడుతూ ‘‘మా ‘అరంగేట్రం’ మూవీ పక్కా కమర్షియల్ మూవీ. అయితే సైకో బేస్డ్ కాన్సెప్ట్‌తో సాగుతుంది. మంచి ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్, మంచి లవ్ స్టోరి ఉంటుంది. వీటిని లింక్ చేసేలా క్రైమ్ ఎలిమెంట్ కూడా…