డబ్బింగ్‌ పార్ట్‌ పూర్తి చేసే పనిలో ‘జీబ్రా’

'Zebra' in the process of completing the dubbing part

సహాయ నటుడిగా కెరీర్‌ ప్రారంభించి.. జ్యోతిలక్ష్మి సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారాడు సత్యదేవ్‌. సినిమాలు భారీ రేంజ్‌లో హిట్లు కాకపోయినా.. ఉన్నంతలో కాస్త బెటర్‌గానే పర్‌ఫార్మ్‌ చేస్తుంటాయి. ప్రస్తుతం సత్యదేవ్‌ మూడు సినిమాలను లైన్‌లో పెట్టాడు. అందులో ’జీబ్రా’ ఒకటి. ఈ చిత్రానికి ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ అందరినీ ఆకట్టుకుంది. కాగా ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్‌ ఓ సాలిడ్‌ అప్‌డేట్‌ను ప్రకటించారు. కెరీర్‌ బిగినింగ్‌ నుంచి సత్యదేవ్‌ కథా బలమున్న సినిమాలనే చేస్తూ వస్తున్నాడు. హీరోగానే కాకుండా మధ్య మధ్యలో కీలక పాత్రల్లోనూ మెరుస్తున్నాడు. సినిమాకు సంబంధించి డబ్బింగ్‌ కార్యక్రమాలు ప్రారంభమైనట్లు.. సత్యదేవ్‌ కూడా తన రోల్‌కి డబ్బింగ్‌ చెబుతున్నట్లు మేకర్స్‌ సోషల్‌ మీడియాలో ప్రకటించారు. అంతేకాకుండా ‘జీబ్రా’ చిత్రం…