‘నేను విన్నాను.. నేనున్నాను’… ఎమోషనల్ జర్నీగా ‘యాత్ర 2’… ఆకట్టుకుంటోన్న ట్రైలర్

'Nenu Vinnaanu... Nenunnaanu'...Impressive 'Yatra 2' Trailer Evokes An Emotional Journey

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పేద‌ల క‌ష్ట‌న‌ష్టాల‌ను తెలుసుకుని వాటిని తీర్చ‌టానికి చేసిన పాద‌యాత్ర ఆధారంగా రూపొందిన సినిమా ‘యాత్ర’. దీనికి కొనసాగింపుగా రూపొందిన చిత్రం ‘యాత్ర 2’. వై.ఎస్‌.ఆర్ పాత్ర‌లో మ‌ల‌యాళ స్టార్ మ‌మ్ముట్టి న‌టించ‌గా ఆయ‌న‌ త‌న‌యుడు వై.ఎస్‌.జ‌గ‌న్ పాత్ర‌లో కోలీవుడ్ స్టార్ జీవా న‌టించారు. 2009 నుంచి 2019 వ‌ర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన రాజ‌కీయ ప‌రిస్థితులు, వై.ఎస్‌.జ‌గ‌న్ పేద‌ల కోసం చేసిన పాద‌యాత్ర ఆధారంగా ‘యాత్ర 2’ చిత్రాన్ని రూపొందించారు. ఫిబ్ర‌వ‌రి 8న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా శ‌నివారం ‘యాత్ర 2’ ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ‘‘పుట్టుక‌తో చెవుడు ఉందన్న దాని వ‌ల్ల మాట‌లు కూడా రావు. ఏదో మెషిన్ పెడితే విన‌ప‌డి మాట‌లు వ‌స్తాయ‌ని డాక్ట‌ర్లు చెప్పార‌న్నా, మాకు అంత స్థోమ‌త లేదు’’ అంటూ…