క్యూరియాసిటీ క్రియేట్ చేసిన సమంత ‘యశోద’ ట్రైలర్!

samantha Yashodha movie trailer review

‘యశోద’ ఎవరో తెలుసు కదా… కాబోయే మదర్, ఫైటర్ & పవర్‌ఫుల్! *** ‘యశోద’ ఎవరో తెలుసు కదా? ఆ కృష్ణ పరమాత్ముడిని పెంచిన తల్లి! – ట్రైలర్ చివరలో వినిపించిన డైలాగ్. అప్పటికి ‘యశోద’ ఎవరని కాదు, ఎటువంటి మహిళ అనేది కూడా ప్రేక్షకులకు అర్థం అవుతుంది…. షి ఈజ్ ఎ మదర్, ఫైటర్ అండ్ వెరీ పవర్‌ఫుల్ వుమన్ అని! ఆ పాత్రలో సమంత అదరగొట్టారని! సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. నవంబర్ 11న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు. ‘యశోద’ ట్రైలర్‌ను తెలుగులో విజయ్ దేవరకొండ, తమిళంలో సూర్య, హిందీలో వరుణ్ ధావన్, కన్నడలో రక్షిత్…