రాకింగ్ స్టార్ యశ్ పుట్టినరోజును సందర్భంగా ఆయన హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ నుంచి ఆయన సినిమాలో చేస్తోన్న క్యారెక్టర్ ఇంట్రో టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్‌తో యష్ నటించిన రాయ పాత్ర పవర్‌ఫుల్‌గా, బోల్డ్‌గా ఉంది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేలా ఈ టీజర్‌ను రూపొందించారు. అబిమానులు, సినీ వర్గాలు భారీ అంచనాలతో ఈ సినిమా కోసం వెయిట్ చేస్తోన్న నేపథ్యంలో రాయ పాత్రకు సంబంధించిన క్యారెక్టర్ ఇంట్రో సెలబ్రేషన్స్‌లా కాకుండా ఓ స్టేట్‌మెంట్‌లా ఉంది. గమనించాల్సిన విషయమేమంటే.. టాక్సిక్ సినిమాలో తన పాత్ర కంటే ముందు టాక్సిక్ సినిమాలో నటిస్తోన్న ఇతర హీరోయిన్స్ పాత్రలకు సంబంధించిన లుక్స్‌ను విడుదల చేశారు. కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేష్, రుక్మిణి…
