19న రాబోతోన్న ‘జిన్’ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలి : ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో నిర్మాత రాజ్ కందుకూరి

The movie ‘Jin’, which is coming out on the 19th, should be a big success: Producer Raj Kandukuri at the trailer launch event

సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి చిన్మయ్ రామ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా, ప్రకాష్ తుమినాద్, రవి భట్, సంగీత వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ చిత్రం డిసెంబర్ 19న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో సోమవారం నాడు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజ్ కందుకూరి, వీరభద్రం చౌదరి, సోహెల్ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. భూతనాల చెరువు నేపథ్యం ఏంటి? కాలేజ్‌లో దాగి వున్న మిస్టరీ ఏంటి? అనే ఆసక్తికర ప్రశ్నలు రేకెత్తించేలా ట్రైలర్‌ను కట్ చేశారు. నలుగురు యువకులు ప్రేతాత్మలకు చిక్కడం, ఆ కాలేజీ భవనం నుంచి బయటకు రాలేకపోవడం, మధ్యలో జిన్…