శర్వానంద్ హీరోగా త్వరలో రాబోతోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. ఈ మూవీలో సంయుక్త, సాక్షి వైద్య లు హీరోయిన్లుగా నటించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో నిర్మాత అనిల్ సుంకర మీడియాతో మాట్లాడుతూ చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన సంగతులివే.. సంక్రాంతికి గట్టి పోటీ ఉంది కదా? ముందు నుంచే సంక్రాంతి సినిమాగానే రూపొందించారా? -సంక్రాంతికి సరిపడే మూవీగానే ‘నారీ నారీ నడుమ మురారి’ని రూపొందించాం. ఇదొక పండుగ మూవీ. సినిమాలకు సంక్రాంతి సీజన్ అనేది వర్కౌట్ అవుతుంది. మేం అనుకున్నట్టుగానే సినిమా వచ్చింది. సంక్రాంతి సీజన్‌లో…
