చారిత్రాత్మకంగా తెలంగాణ ఉద్యమం గొప్ప అనుభవం అని, కానీ తెలంగాణ ఆకాంక్షలకు అనుభవానికి చాలా అంతరం కనిపిస్తున్నదని పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి నమూనా మార్పుతో ప్రపంచ వ్యాప్తంగా భయంకర వాతావరణం నెలకొని ఉందని ఆవేదన వెలిబుచ్చారు. ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సీనియర్ పాత్రికేయులు కందుకూరి రమేష్ బాబు రచించిన “విను తెలంగాణ” పుస్తకావిష్కరణ జరిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆచార్య హరగోపాల్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పాలకులు ప్రజల గుండె చప్పుడు వినాలని, ప్రజల నాడి తెలుసుకోవాలని సూచించారు. గత పదేళ్ల ప్రభుత్వానికి ఖాళీగా వున్న భూములు మాత్రమే కనిపించాయని, భూమిపై వుండే మనుషులు కనిపించలేదని తీవ్రంగా విమర్శించారు. ప్రాణ త్యాగాలు చేసిన యువత స్ఫూర్తి ఏమయ్యిందని, మానవీయ తెలంగాణ…
