WAPCON–2026: ఆయుర్వేదంతో మహిళా శక్తి.

WAPCON–2026: Women's Power with Ayurveda.

విశాఖపట్నంలో జరిగిన Women Ayurveda Parishad Conference–2026 (WAPCON–2026) దేశంలో తొలి జాతీయ మహిళా ఆయుర్వేద పరిషత్ సదస్సుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆయుష్ శాఖ మద్దతుతో “స్వస్థ నారి – శశక్త భారత్” అనే థీమ్‌తో జరిగిన ఈ కాన్ఫరెన్స్‌ ఆరోగ్యవంతమైన మహిళ బలమైన కుటుంబం, సుస్థిర సమాజం, శక్తివంతమైన దేశానికి పునాది అనే సందేశాన్ని ఇచ్చింది.ఈ సదస్సులో మహిళల బహుముఖ పాత్ర, నాయకత్వం, అలాగే వారు ఎదుర్కొనే ప్రత్యేక ఆరోగ్య సవాళ్ల ( హార్మోనల్, మానసిక ఆరోగ్యం మొదలైనవి)పై నిపుణులు చర్చించారు. మహిళా ఆరోగ్యం మెరుగు పడితే భవిష్యత్తు తరాల సౌఖ్యం, పిల్లల విద్యా పురోగతి, కుటుంబాల ఆర్థిక స్థిరత్వం, సామాజిక భద్రత అన్నీ సుస్థిరంగా బలపడతాయని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే విధానాలు అవలంబించినప్పుడే సమాజంలో సమానత్వం, న్యాయం,…