కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు యూనిక్ అండ్ ఎక్సయిటింగ్ సబ్జెక్ట్స్ చేస్తూ ప్రతి సినిమాతో ప్రేక్షలకు అద్భుతమైన ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్నారు. ప్రస్తుతం కొత్త దర్శకుడు యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో యూనిక్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 3గా సుమంత్ నాయుడు జి నిర్మిస్తారు. హేమ & షాలిని ఈ చిత్రాన్ని సమర్పిస్తారు, సాయి కృష్ణ బొబ్బా, రామాచారి ఎం సహ నిర్మాతలు. ఈ రోజు సినిమా టీం ఒక యానిమేషన్ వీడియో ద్వారా సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేశారు. స్టైలిష్ యానిమేటెడ్ వీడియో ద్వారా టైటిల్‌ను రివిల్ చేశారు. ఈ వీడియో సినిమా నేపథ్యాన్ని కూడా ఆసక్తికరంగా పరిచయం చేస్తుంది. అర్బన్ సెటప్‌లో సాగే ఈ గ్లింప్స్‌లో, కస్టమ్ యెల్లో మోటార్‌సైకిల్‌పై నగర వీధుల్లో దూసుకెళ్తున్న…
