నవంబర్ 3న రాబోతోన్న ‘విధి’ సరికొత్త అనుభూతినిస్తుంది: చిత్రయూనిట్

'Vidhi' coming on November 3 will be a new experience: Chitraunit

రోహిత్ నందా హీరోగా ఆనంది హీరోయిన్‌గా నో ఐడియా బ్యానర్ మీద రంజిత్ ఎస్ నిర్మించిన చిత్ర విధి. శ్రీకాంత్ రంగనాథన్, శ్రీనాథ్ రంగనాథన్ ద్వయం తెరకెక్కించిన ఈ మూవీ నవంబర్ 3న థియేటర్లోకి రాబోతోంది. విడుదల సందర్భంగా చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది. ఈ మేరకు ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో.. నిర్మాత రంజిత్ మాట్లాడుతూ.. ‘దర్శకులు ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. మేకింగ్ కొత్తగా ఉంటుంది. రోహిత్, ఆనంది చక్కగా నటించారు. ఇలాంటి సినిమాలకు సంగీతం చాలా ఇంపార్టెంట్. శ్రీ చరణ్ అద్భుతంగా ఆర్ఆర్ ఇచ్చాడు. సినిమా చూస్తే ప్రేక్షకులకే ఆ విషయం తెలుస్తుంది’ అని అన్నారు. డైరెక్టర్ శ్రీకాంత్ రంగనాథన్ మాట్లాడుతూ.. ‘మా నిర్మాత రంజిత్ వల్లే ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగింది. మా మీద నమ్మకంతో ఈ సినిమాను మొదలుపెట్టారు. ఆయన ఒక…