వెంకట్ సాయి గుండ నటించిన హాలీవుడ్ చిత్రం “ది డిజర్వింగ్” పోస్టర్ విడుదల

Venkat Sai Gunda Starrer Hollywood Movie “The Deserving” Poster Released

వెంకట సాయి గుండ ప్రధాన పాత్రలో నటించిన హాలీవుడ్ చిత్రం “ది డిజర్వింగ్” చిత్రం నుంచి అధికారిక పోస్టర్ విడుదలైంది. ఈ చిత్రం ముఖ్యంగా చిన్నతనంలో జరిగే పరిస్థితులు, గృహహింస, సైకాలజికల్ సమస్యల వంటి సమాజ సమస్యలపై వినుత్నంగా తెరకెక్కించిన సైకాలజికల్ హారర్ థ్రిల్లర్. కేవలం థ్రిల్లర్ మాత్రమే కాకుండా, గాఢమైన సందేశాన్ని కలిగి ఉంది. ప్రత్యేకమైన జానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రజాదరణ పొందుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ చిత్రంలో లీడ్ రోల్ మూగవాడు కావడం ప్రత్యేక అంశం. దీంతో చిత్రం కథ, కథనం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. “ది డిజర్వింగ్” చిత్రం ఇప్పటికే ఫ్రాన్స్, టొరంటో, స్వీడన్, నేపాల్, లండన్, నైజీరియా, బెర్లిన్, స్పెయిన్, న్యూయార్క్, కేన్స్, రోమ్ వంటి దేశాల్లో అనేక అవార్డులను గెలుచుకుని అంతర్జాతీయ గుర్తింపును పొందింది. ఈ చిత్రం బార్సిలోనా,…