నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటిస్తున్న సినిమా “వర్జిన్ స్టోరి” కొత్త పాటని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నేడు విడుదల చేసి మూవీ టీమ్ కి ఆశిస్సులు అందించారు. కొత్తగా రెక్కలొచ్చెనా అనే ఉపశీర్షిక తో ప్రదీప్ బి అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష శ్రీధర్ నిర్మించారు. ఈ సందర్భంగా… దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతూ, “హీరో హీరోయిన్లు సినిమా పేరు కు తగ్గట్టే ఫ్రెష్ గా ఉన్నారు. స్టోరీకి తగ్గట్టే టైటిల్ ఉంది. సాంగ్ చాలా బాగుంది. శ్రీధర్ సినిమా పై చాలా ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్. డైరెక్టర్ ప్రదీప్ వాళ్ల తాత అట్లూరి పుండరీ కాక్షయ్య గారు ఎన్టీఆర్ తో మంచి అనుబంధం…
