వెర్సటైల్ పాత్రలతో అలరిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో, తన సోదరి పూజా శరత్ కుమార్ తో కలిసి దోస డైరీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం’సరస్వతి’. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ ప్రేక్షకులలో క్యురియాసిటీ పెంచింది. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంతో తొలిసారిగా దర్శకురాలిగా మారిన వరలక్ష్మి శరత్ కుమార్, తానే ప్రధాన పాత్రలో నటిస్తూ పక్కా ప్లానింగ్, క్లియర్ విజన్‌తో అనుకున్న సమయానికి షూటింగ్‌ను పూర్తిచేశారు. ఫైనల్ అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చింది. ‘సరస్వతి’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతోంది. ఈ సందర్భంగా వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. సరస్వతి చిత్ర షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేశాం. ఈ ప్రయాణంలో…
