హీరో సందీప్ కిషన్, ట్యాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ ల మోస్ట్ అవైటెడ్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తుండగా, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి రెండు పాటలు- నిజమే నే చెబుతున్నా, హమ్మా హమ్మా చార్ట్‌బస్టర్ హిట్స్ గా అలరిస్తున్నాయి. ఫిబ్రవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా నిర్వహించిన ఈవెంట్ లో ట్రైలర్ ని లాంచ్ చేసింది. సందీప్ కిషన్, వర్షా బొల్లమ్మ మధ్య వండర్ ఫుల్ లవ్ కెమిస్ట్రీ తో ప్రారంభమైన ట్రైలర్ తర్వాత బైరవకోన…