ఉగాదికి గద్దర్ తెలంగాణ సినిమా పురస్కారాలు : ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

Ugadiki Gaddar Telangana Film Awards : Deputy Chief Minister Mallu Bhatti Vikramarka

– ప్రతి యేటా అధికారికంగా భక్త రామదాసు జయంతి ఉత్సవాలు – కళలను ప్రోత్సహిస్తున్న ప్రజా ప్రభుత్వం కళలను కళాకారులను చిత్తశుద్ధితో ప్రోత్సహిస్తున్న ప్రజా ప్రభుత్వం మనదని, ఇకపై ప్రతి యేటా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భక్త రామదాసు గా పిలవబడే కంచర్ల గోపన్న జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. రానున్న ఉగాది పండుగ రోజున గద్దర్ తెలంగాణ సినిమా అవార్డుల ప్రదానోత్సవం జరగనున్నదని ఆయన వివరించారు. తెలంగాణ ప్రభుత్వం సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం ఎల్.బి.ఇండోర్ స్టేడియంలో శ్రీ భక్త రామదాసు 392వ జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ముఖ్య అతిధిగా విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, బిసి సంక్షేమం రోడ్లు భవనాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్త్రీ శిశు సంక్షేమ…