సెన్సార్ సూచనలతోనే ‘వనవీర’గా టైటిల్ మార్పు

Title changed to 'Vanaveera' following censor instructions

అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ‘వనవీర’. ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ‘వనవీర’ చిత్రాన్ని శంతను పత్తి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ పై అవినాష్  బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్, వివేక్ సాగర్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నాయి. మైథలాజికల్ రూరల్ డ్రామా కథతో తెరకెక్కిన “వనవీర” సినిమా న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా హీరో, డైరెక్టర్ అవినాష్ తిరువీధుల మాట్లాడుతూ.. అన్ని నిబంధనల ప్రకారమే మా మూవీ టైటిల్ రిజిస్టర్ చేసుకున్నాం.…