25న వస్తున్న ‘తోడేలు’ చిత్రాన్ని ఆదరించండి : వరుణ్ దావన్

Thodeelu pressmeet Still-1

వరుణ్‌ ధవన్‌, కృతిససన్‌ కాంబినేషన్‌లో హిందీలో వస్తున్న చిత్రం ‘భేదియా’. ఈ చిత్రం తెలుగులో ‘తోడేలు’ టైటిల్‌తో ‘గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్’ ద్వారా విడుదలవుతుంది. ఈ చిత్రం నవంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో శనివారం మేకర్స్ తెలుగు ప్రీ రిలీజ్‌ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. నిర్మాత దినేష్ విజన్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. అరవింద్ గారికి, గీతా ఆర్ట్స్ కి ముందుగా థాంక్స్ చెబుతున్నాను. మీరు మాకు ఇన్స్ప్రెషన్. ఈ సినిమాను మీరు తెలుగులో విడుదల చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ‘తోడేలు’ సినిమా నవంబర్ 25న విడుదల అవుతుంది. ఖచ్చింతగా చూస్తారని ఆశిస్తున్నాను. మెగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ముందుగా మీడియాకు కృతజ్ఞతలు తెలుపుతూ… ‘బాహుబలి’ సినిమా తరువాత తెలుగు, హిందీ, సౌత్, నార్త్ అని ఎల్లలు…