తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రకటనకు శ్రీకారం పడింది. జయసుధ జ్యూరీ ఛైర్మన్ గా ఉన్న 2024 సినిమా అవార్డుల కమిటీ విజేతల జాబితాను ప్రకటించింది. ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఎ.డి.’ చిత్రానికి నాలుగు అవార్డులు దక్కాయి. ప్రధమ ఉత్తమ చిత్రం అవార్డును ఈ సినిమా పొందింది. అలానే ఈ చిత్ర దర్శకుడు నాగ అశ్విన్ ఉత్తమ దర్శకుడి అవార్డుకు ఎంపికయ్యారు. ‘కల్కి 2898 ఎ.డి.’ ఆర్ట్ డైరెక్టర్ అద్నితిన్ జిహానీ చౌదరి, కాస్ట్యూమ్ డిజైనర్ అర్చనా రావ్, అజయ్ కుమార్ కూడా గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ కు ఎంపికయ్యారు. ‘కల్కి 2898 ఎ.డి.’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించారు. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024లో నాలుగు అవార్డులు అందుకున్న మరో చిత్రం ‘లక్కీ…
