ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో మెగాస్టార్ చిరంజీవి బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అటు ‘విశ్వంభర’, ఇటు ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాల షూటింగ్స్ తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇప్పుడు తన సోషల్ మీడియా ఖాతాలో 80’s రీయూనియన్ ఫోటోస్ షేర్ చేస్తూ అందమైన జ్ఞాపకాలంటూ రాసుకొచ్చారు. భారతీయ సినిమా ప్రపంచాన్ని శాసించిన తారలు 80’sలో అనేక మంది ఉన్నారు. అటు ఉత్తరాది, ఇటు దక్షిణాదికి చెందిన నటీనటులు అందరూ తాజాగా ఒకేచోట కలిశారు. ఆనాటి రోజులను గుర్తు చేసుకుంటూ సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. మొత్తం 31 మంది స్టార్స్ కలిసి అక్టోబర్ 4న చెన్నైలో పార్టీ చేసుకున్నారు. గత కొన్నాళ్లుగా అలనాటి తారలు ప్రతి సంవత్సరం రీయూనియన్ వేడుకలు నిర్వహించుకుంటున్న సంగతి…
