ఆలేరు, మే 1: ( టాలీవుడ్ టైమ్స్ ప్రతినిధి) యా దాద్రి భువనగిరి జిల్లా ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కు తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి సునీత రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ అధ్యక్షతన వహించారు. మొదటగా ఎస్.బి.హెచ్ బ్యాంక్ దగ్గర ఉన్న జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి. గాంధీ గారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బస్టాండ్ చౌరస్తాలో ఎల్పిజి గ్యాస్ ధరలు పెంచినందుకు నిత్యావసర ధరలు పెంచినందుకు నిరసనగా ఖాళీ సిలిండర్లతో కూరగాయలతో నిత్యావసర వస్తులతోప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. తదుపరి అస్సాం సీఎం హేమంత్ విశ్వశర్మ మహిళలపై చేసిన అనుచిత వాక్యాలను ఖండిస్తూ…
