ఆనందానికి అవధుల్లేవు : మెగాస్టార్ చిరంజీవి

There is no limit to happiness: Megastar Chiranjeevi

రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులకు కవలలు – ఒక బాబు, ఒక పాప జన్మించడంతో మెగా కుటుంబంలో అపూర్వమైన ఆనందం నెలకొంది. ఈ ప్రసవం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో జరిగింది. ఈ శుభవార్త చిరంజీవి కుటుంబంలో రెట్టింపు వేడుకలని తీసుకొచ్చింది.  ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..మా శ్రేయోభిలాషులు, మా అభిమానులు, మా మంచి కాంక్షించే ప్రతి ఒక్కరికి మా ఇంటి జరిగిన ఈ శుభవార్త మీతో పంచుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇటు కొణిదెల ఫ్యామిలీ అటు కామినేని ఫ్యామిలీ రెండు కుటుంబాలు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాము. రామ్ చరణ్ ఉపాసన రాత్రి కవలలకు జన్మనిచ్చారు. ఉపాసన, బిడ్డలు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఈ సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాము.  మా ఇంట ఈ మంచి జరగాలని మీరు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. భగవంతుడి…