లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్ గారు కొత్త సినిమాలని ప్రేక్షకులకు అందివ్వడంలో మొదటి వరుసలో ఉంటారు. సినిమా చూపిస్త మామ, మేము వయసుకు వచ్చాం, హుషారు లాంటి యూత్ ఫుల్ ఎంటర్ టెయినర్స్ ని నిర్మించిన బెక్కెం వేణుగోపాల్ గారు నూతన దర్శకుడు ప్రణవ స్వరూప్ చెప్పిన కథ నచ్చడంతో రియా జియా ప్రొడక్షన్స్ అనే కొత్త బ్యానర్ తో కలసి ఒక రొమాంటిక్ థ్రిల్లర్ ని నిర్మిస్తున్నారు. అందరికి సుపరిచితుడు అయిన నందు హీరో గా నటించగా ఉయ్యాల జంపాల సినిమా తో తెలుగు తెరకి పరిచయమై సినిమా చూపిస్త మావ లాంటి చిత్రాలతో తన నటనతో తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందిన అవికా గోర్ ఈ చిత్రం లో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఎంతో మంది కొత్త దర్శకులని పరిచయం చేసిన బెక్కెం…