Thandel Movie Review in Telugu : ‘తండేల్’ మూవీ రివ్యూ : దేశభక్తిని రగిలించే ప్రేమకథ !

Thandel Movie Review in Telugu

తెలుగు చిత్రసీమలో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా అభిరుచి గల నిర్మాత బన్నీ వాసు నిర్మించిన చిత్రం ‘తండేల్’. ప్రేమ కథగా, దేశభక్తిని రగిలించే కథతో వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించారు. ఉత్తరాంధ్ర జాలరు కథగా తెరకెక్కిన ఈ సినిమాలో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించారు. ఈ సినిమా విడుదలకు ముందు వచ్చిన టీజర్, ట్రైలర్, పాటలు ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీనికి తగ్గట్టుగానే ప్రమోషన్స్ కూడా భారీగా చేయడంతో సగటు ప్రేక్షకుడికి సినిమాపై ఆసక్తి ఏర్పడింది. సినిమా అనౌన్స్ చేసినప్పటినుంచి ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను ప్రమోషనల్ కంటెంట్ ఇంకా పెంచింది. ఇక భారీ అంచనాలతో ఈ సినిమా నేడు (ఫిబ్రవరి…