“తల్లి మనసు” చిత్రానికి ప్రభుత్వం వినోదపుపన్ను మినహాయింపు ఇవ్వాలని ప్రముఖ నటుడు, దర్శకనిర్మాత ఆర్. నారాయణ మూర్తి అభిలషించారు. రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రధారులుగా ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై సీనియర్ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సమర్పణలో ఆయన తనయుడు ముత్యాల అనంత కిషోర్ తొలిసారి నిర్మాతగా మారి, నిర్మించిన చిత్రమిది. పూర్వాశ్రమంలో దర్శకత్వ శాఖలో పనిచేసి, అనుభవం గడించిన వి.శ్రీనివాస్ (సిప్పీ) దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. కాగా తెలుగు సినీ డైరెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ చిత్రం యూనిట్ కు అభినందన సత్కారం జరిగింది. ఈ సందర్భంగా దర్శకుల అసోసియేషన్ కు ఈ చిత్రం ప్రదర్శనను హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఏర్పాటు చేశారు. చిత్రాన్ని తిలకించిన అనంతరం ఆర్. నారాయణమూర్తి…