‘సైంధవ్’ నా కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్: ట్రైలర్ విడుదలలో విక్టరీ వెంకటేష్

'Saindhav' is the best film in my career: Victory Venkatesh at trailer release

విక్టరీ వెంకటేష్ మైల్ స్టోన్ 75 వ చిత్రం ‘సైంధవ్’ వెరీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ యూనిక్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్ని ఫార్మాలిటీస్ ని పూర్తి చేసుకొని సంక్రాంతికి జనవరి 13 న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. విడుదల తేదీ సమీపిస్తున్నందున టీమ్ ప్రమోషన్స్ లో మరింత దూకుడు పెంచిది. ఈ రోజు, మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. పాప డ్యాన్స్ చేస్తూ తన తండ్రిని అనుకరిస్తూ చాలా ప్లజెంట్ గా ట్రైలర్ ప్రారంభమైయింది ఓపెనింగ్ సీక్వెన్స్ తండ్రీకూతుళ్ల బంధాన్ని అద్భుతంగా ఎస్టాబ్లెస్ చేసింది. తండ్రికి తన కూతురే సర్వస్వం. కూతురుకి తండ్రి సూపర్‌హీరో. దురదృష్టవశాత్తు, ఆమెకు స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే అరుదైన వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది. వ్యాధిని నయం చేసే ఇంజక్షన్…