మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా తమన్నా చేసిన స్పెషల్ సాంగ్ ‘కొడితే’కు సోషల్ మీడియాలో అనూహ్య స్పందన వచ్చింది. ఆమె పాటకు రీల్స్ చేస్తున్నారందరూ. తమన్నా తన పాటకు తానే రీల్ చేసుకున్నారు. తాజాగా ఈ పాటకు హీరోయిన్ సాయి మంజ్రేకర్ కూడా రీల్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోకు కూడా అద్భుతమైన స్పందన వస్తుంది. గని సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా మేకోవర్ అయ్యారు. సిక్స్ ప్యాక్ చేసి సరికొత్త ఫిజిక్‌తో కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్…