పూరీ ‘జన గణ మన’లో హీరో ఎవరో తెలుసా?!

purijagannadh director

టాలీవుడ్ లో ఎంత పెద్ద దర్శకుడు అయినా కూడా తన కెరీర్‌లో ఓ కలల ప్రాజెక్ట్ అయితే తప్పకుండా ఉండి ఉంటుంది. అలాగే సెన్సేషనల్ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్ కు కూడా ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. అదే ‘జన గణ మన’. పూరీకి ఎప్పట్నుంచో కోరిక ఈ ప్రాజెక్ట్ చేయాలని. ఈ సినిమాతో దేశానికి ఏదో చెప్పాలని ఎన్నో సంత్సరాలుగా ప్రయత్నిస్తున్నాడు. మూడేళ్ల క్రితం ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు పూరీ జగన్నాథ్. ఈ సినిమాతో ఈయన కోసం మళ్లీ స్టార్ హీరోలు వేచి చూస్తారేమో అనుకున్నారు కానీ అలాంటిదేం జరగలేదు. రామ్ హీరోగా నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ గొప్ప కథేం కాదు.. మామూలు రెగ్యులర్ మాస్ మసాలా సినిమా అంతే. అది విడుదలైన టైమ్‌లో సినిమాలేం లేవు కాబట్టి బ్లాక్ బస్టర్…