సినిమాల నుంచి రిటైర్మైంట్‌ ప్రకటించారు ‘ప్రేమమ్‌’ దర్శకుడు ఆల్ఫోన్స్‌ పుతిరన్‌!

'Premam' director Alphonse Puthiran has announced his retirement from films!

ఆల్ఫోన్స్‌ పుతిరన్‌.. ఈ పేరు చెబితే ఎవరూ గుర్తుపట్టకపోవచ్చు కానీ.. ‘ప్రేమమ్‌’ డైరెక్టర్‌ అంటే ఇట్టే గుర్తు పడతారు. నివిన్‌ పాలీ, మడోన్నా సెబాస్టియన్‌, సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం ‘ప్రేమమ్‌’. ఆల్ఫోన్స్‌ పుతిరన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. 2015లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టించింది. ఈ సినిమాలో సాయి పల్లవి చేసిన మలర్‌ పాత్ర ఆడియన్స్‌ను ఓ రేంజ్‌లో ఇంపాక్ట్‌ చేసింది. ఇక.. ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులు మలయాళం సినిమాలను చూడడం మొదలుపెట్టారంటే నమ్మక తప్పదు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా దర్శకుడు ఆల్ఫోన్స్‌ పుతిరన్‌ సంచలన ప్రకటన చేశాడు. తాను డైరెక్షన్‌ నుంచి సినిమాల నుంచి రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నట్లు సంచలన ప్రకటన చేశాడు. తనకు ఆటిజం స్పెక్ట్రమ్‌ డిజార్డర్‌ ఉందని అందుకే…