బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్‌గా కట్టప్ప పాత్రలో సత్యరాజ్ అందరినీ అలరించారు. సౌత్‌లో సత్యరాజ్ హీరోగా, కారెక్టర్ ఆర్టిస్ట్‌గా వందల చిత్రాల్లో నటించారు. ఇప్పటికీ సత్యరాజ్ చేతి నిండా ప్రాజెక్టులతో కుర్ర హీరోలకు పోటీ అనేట్టుగా పని చేస్తున్నారు. సినిమాని ప్రమోట్ చేయడంలోనూ కుర్ర హీరోలతో పోటీ పడుతున్నారు సత్యరాజ్. సత్యరాజ్ ప్రముఖ పాత్రలో నటించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యులాయిడ్ బ్యానర్‌పై విజయ్‌పాల్ రెడ్డి అడిదాల నిర్మించిన ఈ చిత్రానికి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో టీం బిజీగా ఉంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్ అందరినీ అలరించింది. పాటలు, టీజర్, గ్లింప్స్ ఇలా ప్రతీ ఒక్కటీ ఆడియెన్స్‌లో సినిమా పట్ల ఆసక్తిని పెంచింది. ప్రస్తుతం మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ట్రెండ్‌ను…