చిరంజీవికి అభిమానులుంటారు బాలయ్య బాబు కి అభిమానులుంటారు, అమితాబ్ కు ఉంటారు, రజనికి ఉంటారు, సచిన్ కు ఉంటారు, ధోని కి ఉంటారు. కానీ అంబానీకి ఎవరైనా అభిమానులుంటారా? ఒకడున్నాడు, వాడి పేరు శివ…. 21 ఏళ్ల పిలగాడు. అంబానీకి అర వీర అభిమాని. ఉద్యోగం వ్యవసాయం కాదు, వ్యాపారం చేసి వేలు , కాదు కోట్లు, కాదు కాదు వేల కోట్లు సంపాదించాలని వీడి ఆశ. అదృష్టానికో, దురదృష్టానికో ఉన్న ఉళ్లోనే వీడికి కోట్లు సంపాదించే అవకాశం వస్తుంది. కానీ చీమకు ఏనుగు ఆహారంగా దొరికిన పరిస్థితి. ఎత్తుకెళ్లి పుట్టలో పెట్టుకోలేదు, తిని అరిగించుకోలేదు. ఈ లోపు వేట కుక్కలు, గుంట నక్కలు, హైనాలు, రాబందుల్లాంటి మనుషులను, వైకుంఠపాళి వ్యవస్థలోని అధికార పాములను తప్పించుకుంటూ తట్టుకొని ఈ శివ అనే చిరు చీమ ఏ నిచ్చెనలెక్కి,…