పద్మశ్రీ మురళీ మోహన్ : ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో తనదైన ముద్ర

Padma Shri Murali Mohan: Making his mark in the film industry for over five decades

లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వచ్చింది : పద్మశ్రీపై మురళీ మోహన్ గణతంత్ర దినోత్సవ వేళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో తనకు పద్మశ్రీ పురస్కారం దక్కడంపై సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మాగంటి మురళీ మోహన్‌ హర్షం వ్యక్తం చేశారు.‘‘నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసిన పద్మ అవార్డు ఆదివారం సాయంత్రం ప్రకటించినప్పటి నుంచి అనేక మంది మిత్రులు, శ్రేయోభిలాషులు ఫోన్ చేశారు. వాళ్లందరితో నా సంతోషాన్ని పంచుకునే అవకాశం లభించింది. ‘మీకు ఎప్పుడో రావాల్సింది.. ఇప్పుడైనా వచ్చింది’ అని అంటుంటే.. లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వచ్చింది అని చెప్పాను. అన్నీ మనం అనుకున్నప్పుడే రావు. ఏదైనా ఎదురు చూపుల తర్వాత దొరికితే దాని విలువ ఎక్కువ. మిత్రులందరికీ నా శుభాకాంక్షలు. ఇంత మంచి అవార్డును ప్రకటించిన ప్రధాని నరేంద్రమోదీగారికి,ఏపీ సీఎం…