క్లాసిక్ సినీ క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ పారిశ్రామికవేత్త classic గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ తల్లాడ వెంకన్న హీరోగా నటించిన చిత్రం ‘ఒక్కడే 1’. సుదీక్ష సునీత, మధుమిత కథానాయికలుగా, జునైద్ షేక్ విలన్ గా నటించగా, శ్రీపాద రామచంద్రరావు దర్శకత్వం వహించారు. కాగా ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికేట్ పొందింది. ఈ సందర్భగా చిత్ర హీరో వెంకన్న మాట్లాడుతూ… ఇటీవలే సీబీఐ మాజీ డెరైక్టర్ జేడీ లక్ష్మీ నారాయణ గారి చేతుల మీదుగా మా చిత్ర టీజర్ విడుదల చేయడం ప్రేక్షకులకు తెలిసిందే. అలాగే మా సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వడం, సినిమా బాగుందని అప్రిషియేట్ చేయడం నాకు కొండంత బలాన్ని ఇచ్చింది. నాకు పోలీస్ ఆఫీసర్ కావాలని చాలా బలమైన కోరిక ఉండేది. కానీ…
