కెరాఫ్ కంచెరపాలెం చిత్రం లో జోసెఫ్ గా నటించి వీక్షకుల్ని ఆకట్టుకున్న కార్తిక్ రత్నం హీరోగా, సుప్యార్ధ్ సింగ్ హీరోయిన్ గా ప్రముఖ నిర్మాత యాదగిరి రాజు శ్రీకళ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ లో, బ్లాక్ బాక్స్ స్టూడియోస్ సమర్పణ లో నిర్మిస్తున్న చిత్రం లింగొచ్చా (గేమ్ ఆఫ్ లవ్).. ఈ చిత్రానికి ఆనంద్ బడా దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు హైదరాబాది కావటం వలన ఇక్కడ ఎంతో ఫేమస్ అయిన లింగోచ్చా గేమ్ నేపధ్యం లో ఒక చక్కటి ప్రేమకథని రాసుకుని తెరకెక్కించారు. అంతే కాదు ఈ ప్రేమకథ కి లింగోచ్చా అనే టైటిల్ ని ఖరారుచేయటం విశేషం. ఈ టైటిల్ విన్న ప్రతిఓక్కరూ సౌండింగ్ కొత్త గా వుందని అనటం యూనిట్ కి కొత్త ఎనర్జి ఇచ్చింది. ఇదే ఎనర్జితో లింగోచ్చా టీజర్ ని రెడి చేశారు.…