మేమ్ ఫేమస్ తో స్ట్రాంగ్ డెబ్యు చేసిన న్యూ ఏజ్ యాక్టర్ సుమంత్ ప్రభాస్ ‘గోదారి గట్టుపైన’ సినిమాతో అలరించబోతున్నారు. ఈ చిత్రం రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ కు ఫస్ట్ వెంచర్. ఎం.ఆర్. ప్రొడక్షన్స్ షార్ట్ ఫిల్మ్‌లతో పాపులరైనా సుభాష్ చంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నిధి ప్రదీప్ కథానాయికగా అరంగేట్రం చేస్తుండగా, జగపతి బాబు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ బ్రీజ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు మేకర్స్ ఫస్ట్ సింగిల్ – చూడు చూడు (సైడ్ ఎ) లిరికల్ వీడియోను విడుదల చేశారు. నాగ వంశీ కృష్ణ కంపోజ్ చేసిన ఈ సాంగ్ నదీ తీరాల సువాసనను తీసుకుని వచ్చే ఈదురుగాలిలా అనిపిస్తుంది. ప్రేమను రంగుల్తో నింపే ఈ ట్యూన్ హృదయాన్ని నాట్యం చేయిస్తుంది. ఫ్లూట్, వైలిన్, నాదస్వరంలాంటి…
